ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం... అధికారుల వేధింపులే కారణమా..? - crime news

తెలంగాణలోని ఘట్​కేసర్​ ఠాణా ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐ చంద్రబాబు వేధింపులే కారణమని ఉన్నతాధికారులతో రామకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది.

ghatkesar-asi
ghatkesar-asi

By

Published : Aug 15, 2020, 7:41 PM IST

తెలంగాణలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఘట్​కేసర్ ఠాణా ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్​స్టేషన్​లో‌ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణను అధికారులు తీవ్రంగా మందలించారని సమాచారం. దీంతో మనస్తాపం చెందిన రామకృష్ణ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.

కొద్ది సేపటి తర్వాత ఘట్​కేసర్ సీఐ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశారు. భయాందోళనకు గురైన సీఐ, సిబ్బంది ఏఎస్సై ఆచూకీ కోసం గాలించారు. తారామతిపేట వెళ్లేమార్గంలో సర్వీసు రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో రామకృష్ణ ముందు భాగంలో పడి ఉండటం చూసిన పోలీసులు జోడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీఐ జంగయ్య వేధింపులే కారణమని ఏఎస్సై ఉన్నతాధికారులతో చెప్పినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details