ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sanjay Agarwal Case : ఎస్‌బీఐ నుంచి రూ.67కోట్ల రుణం.. నగల వ్యాపారి అరెస్టు - తెలంగాణ నేర వార్తలు

ఎస్‌బీఐ నుంచి రూ.67కోట్ల రుణం తీసుకున్న నగల వ్యాపారి సంజయ్ అగర్వాల్ అరెస్టు

Sanjay Agarwal Case
ఎస్‌బీఐ నుంచి రూ.67కోట్ల రుణం..నగల వ్యాపారి అరెస్టు

By

Published : Feb 13, 2022, 3:42 PM IST

Sanjay Agarwal Case : మనీలాండరింగ్ కేసులో ఘనశ్యామ్ పెరల్స్, జ్యువెలరీ భాగస్వామి సంజయ్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సంజయ్ నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎస్​బీఐ బ్యాంకులో రూ.67కోట్ల రుణం తీసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించారు. అక్రమంగా సంపాదించిన డబ్బునంతా.. భార్య, సోదరులు, ఉద్యోగుల పేరిట ఉన్న డొల్ల కంపెనీలకు బదిలీ చేశాడు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం ఎంతకీ కట్టకపోవడంతో అతడిని బ్యాంకు డీఫాల్టర్‌గా తేల్చింది. అనంతరం సంజయ్‌ అగర్వాల్‌ సమర్పించిన పత్రాలు సరిచూడగా.. అవి నకిలీవని తేలింది.

జ్యుడీషియల్‌ రిమాండ్‌
బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకముందే... సంజయ్‌ అగర్వాల్‌ కుటుంబీకులు తెలివిగా.. అబిడ్స్‌లోని ఎస్​బీఐ బ్రాంచిలో ఉన్న తమ బంగారాన్ని తీసేసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. గతంలో సుంకం లేకుండా బంగారాన్ని దిగుమతి చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించిన కేసులో.. కలకత్తా ఈడీ అధికారులు.. అరెస్టు చేశారు. జైల్లో ఉన్న సంజయ్‌ను.. పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా... సంజయ్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

గతేడాది కోల్​కతా ఈడీ కేసు
హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్​ను ఈడీ అధికారులు గతేడాది నవంబర్​లో అరెస్టు చేశారు. పుణెలో ఓ వివాహానికి వెళ్తుండగా అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోల్​కతా కోర్టులో హాజరు పరిచారు. కోల్​కతా కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మూడేళ్ల క్రితం సంజయ్ కుమార్ అగర్వాల్, ఆయన కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్​పై కోల్​కతాలో డీఆర్ఐ కేసు నమోదు చేసింది.

అభియోగం ఏంటి?
ఎగుమతుల పేరిట ఎంఎంటీఎస్, డైమండ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సుంకం మినహాయింపు ఉన్న బంగారం దిగుమతి చేసుకున్న సంజయ్ కుమార్ అగర్వాల్.. అక్రమంగా దేశీయంగా చెలామణి చేసినట్లు అభియోగం. డీఆర్ఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న కోల్​కతా ఈడీ అధికారులు.. గతంలో ప్రీత్ కుమార్ అగర్వాల్​ను అరెస్టు చేసింది.

ఇదీ చదవండి:పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం

ABOUT THE AUTHOR

...view details