హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కరోనా దృష్ట్యా దృశ్యమాధ్యమంలో నిర్వహిస్తున్నారు.
బయో ఆసియా సదస్సులో భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు ఎక్స్‌లెన్స్ అవార్డ్ - Genome Valley of Excellence Award
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లను జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయో ఆసియా సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
MURDER
కార్యక్రమంలో భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందజేశారు. జీవశాస్త్ర రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి పురస్కారాలు అందించేందుకు ప్రతి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సెన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :శ్రీనగర్ నౌగామ్‌లో ఐఈడీ కలకలం!