తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటానని తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్(Gellu srinivas) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సభలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
Gellu srinivas: 'నన్ను గెలిపిస్తే మీ పనిమనిషిలా సేవ చేసుకుంటా' - gellu srinivas
పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu srinivas yadav) కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించే బాధ్యతను కేసీఆర్.. మంత్రి హరీశ్‌రావుకు అప్పగించినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో నిర్వహించిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు.. హుజూరాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. చదువుకునే రోజుల నుంచి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను. ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటాను. -గెల్లు శ్రీనివాస్, హుజూరాబాద్ తెరాస అభ్యర్థి.
పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కేసీఆర్ అవకాశం కల్పించారని శ్రీనివాస్ అన్నారు. విద్యార్థి నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. దళిత, బహుజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడానని పేర్కొన్నారు.