రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే 12 కార్పోరేషన్లలో రిజర్వేషన్లు పూర్తి చేయగా.. మున్సిపాల్టీలు , నగర పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. రాష్ట్రంలో 76 మున్సిపాల్టీలు, 27నగరపాలక సంస్ధలు కలిపి మొత్తం 103 ఉన్నాయి. వీటన్నింటికీ ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మరో గెజిట్ జారీ చేశారు. గెజిట్లో ఉన్న ప్రకారం... ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా:-
ఇచ్ఛాపురం | జనరల్ మహిళ |
ఆమదాలవలస | బీసీ మహిళ |
పలాస-కాశీబుగ్గ | బీసీ జనరల్ |
విజయనగరం జిల్లా:-
బొబ్బిలి | బీసీ జనరల్ |
పార్వతీపురం | బీసీ మహిళ |
సాలూరు | జనరల్ మహిళ |
నెల్లిమర్ల నగరపంచాయతీ | ఎస్సీ మహిళ |
విశాఖ జిల్లా:-
నర్సీపట్నం | ఎస్సీ మహిళ |
ఎలమంచిలి | బీసీ మహిళ |
తూర్పు గోదావరి జిల్లా:-
పెద్దాపురం | బీసీ మహిళ |
మండపేట | బీసీ మహిళ |
తుని | జనరల్ మహిళ |
అమలాపురం | జనరల్ మహిళ |
పిఠాపురం | జనరల్ మహిళ |
రామచంద్రాపురం | జనరల్ మహిళ |
సామర్లకోట | జనరల్ మహిళ |
గొల్లప్రోలు నగరపంచాయతీ | జనరల్ మహిళ |
ముమ్మిడివరం నగరపంచాయతీ | ఎస్సీ జనరల్ |
ఏలేశ్వరం నగర పంచాయతీ | బీసీ మహిళ |
పశ్చిమ గోదావరి జిల్లా:-
జంగారెడ్డిగూడెం | జనరల్ మహిళ |
కొవ్వూరు | ఎస్సీ మహిళ |
నర్సాపురం | బీసీ మహిళ |
నిడదవోలు | జనరల్ |
ఆకివీడు | బీసీ మహిళ |
భీమవరం | బీసీ మహిళ |
తణుకు | జనరల్ మహిళ |
పాలకొల్లు | జనరల్ |
తాడేపల్లిగూడెం | జనరల్ మహిళ |
కృష్ణా జిల్లా:-
గుడివాడ | జనరల్ |
జగ్గయ్యపేట | బీసీ జనరల్ |
కొండపల్లి | బీసీ జనరల్ |
నందిగామ | జనరల్ మహిళ |
నూజివీడు | జనరల్ మహిళ |
పెడన | బీసీ మహిళ |
ఉయ్యూరు నగర పంచాయతీ | జనరల్ |
గుంటూరు జిల్లా:-
గురజాల నగరపంచాయతీ | జనరల్ మహిళ |
మాచర్ల | బీసీ జనరల్ |
మంగళగిరి | బీసీ మహిళ |
నరసరావుపేట | జనరల్ |
అద్దంకి నగర పంచాయతీ | ఎస్సీ మహిళ |
బాపట్ల | జనరల్ మహిళ |
చిలకలూరిపేట | జనరల్ |
దాచేపల్లి నగర పంచాయతీ | జనరల్ మహిళ |
పిడుగురాళ్ల | జనరల్ |
పొన్నూరు | ఎస్సీ మహిళ |
రేపల్లె | ఎస్టీ మహిళ |
సత్తెనపల్లి | జనరల్ మహిళ |
తాడేపల్లి | ఎస్సీ జనరల్ |
తెనాలి | జనరల్ మహిళ |
తిరువూరు నగర పంచాయతీ | ఎస్సీ జనరల్ |
వినుకొండ | బీసీ జనరల్ |