ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​​లో గ్యాస్ లీకేజీ.. ఆందోళనలో స్థానికులు - నిజాంపేట్​లో గ్యాస్ లీకేజీ

Gas Leakage at Hyderabad: తాగునీటి పైప్​లైన్ పనులు చేస్తుండగా గ్యాస్​ పైపులైన్ పగిలిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్​ నిజాంపేట్ ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమై.. లీకేజీని అరికట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Gas Leakage at Hyderabad
Gas Leakage at Hyderabad

By

Published : Jan 7, 2022, 5:46 PM IST

హైదరాబాద్​​లో గ్యాస్ లీకేజీ.. ఆందోళనలో స్థానికులు

Gas Leakage at Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నిజాంపేట్‌ ప్రధాన రహదారిలో గ్యాస్‌ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. గాయత్రీ టవర్‌ సమీపంలో జేసీబీతో నీటి పైపులైను మరమ్మతులు చేస్తుండగా.. పక్కనే ఉన్న గ్యాస్‌ పైప్‌ పగిలిపోయింది. అందులో నుంచి గ్యాస్‌ లీకవుతుండడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా గాళ్లోకి దుమ్ము, ధూళి ఎగిసిపడ్డాయి. ఆ రహదారిలో నుంచి వెళ్లే వారంతా ఇబ్బందులు పడ్డారు. కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా వచ్చిన ఆ అధికారులు గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు. లీకేజీ ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

చెప్పినా వినలేదు..

'గతంలో ఈ ప్రాంతంలో ఓసారి నీటి పైపులు పగిలిపోతే.. భాగ్యనగర్​ నిర్మాణ సంస్థ వాళ్లు వచ్చి మరమ్మతులు చేశారు. మరమ్మతులు చేసేటప్పుడు పైపులు పగిలి గ్యాస్ లీకవ్వడంతో అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఇక్కడ కూడా పైపులు మరమ్మతులు చేస్తామని గాయత్రి టవర్ నిర్మాణ సంస్థ వాళ్లు వచ్చారు. మేం వాళ్లకి చెప్పాం.. గ్యాస్ పైపులైన్ ఉంది. గ్యాస్ పైపులైన్ మరమ్మతులు చేసే వాళ్లతో కాంటాక్ట్ అయి.. సమన్వయంతో పని చేయమని చెప్పాం. కానీ వాళ్లు మా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుకుందే జరిగింది' - స్థానికుడు

ఇదీ చదవండి :Houses demolished in macharla: చెదిరిన పేదల గూడు.. రోడ్డున పడ్డ 60 కుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details