ఎల్‌పీజీ గ్యాస్.. ఇది వాడుకలోకి వచ్చినప్పటి నుంచి కట్టెల పొయ్యిపై వంట చేయడం తగ్గిపోయింది. ప్రస్తుతం మారుమాల గ్రామాల్లోనూ గ్యాస్‌తోనే వంట చేస్తున్నారు. పొగ కష్టాలు పోయి సులభంగా వంటింటి పని పూర్తి చేసేస్తున్నారు. అయితే.. ఒక్కోసారి అప్రమత్తంగా లేక.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో.. గ్యాస్ బ్లాస్ట్ వంటి ప్రమాదాల్లో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారమే.. ఇటీవల పెరుగుతున్న గ్యాస్ లీకేజ్ ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది.
ఇటీవలి ఘటనలు..
తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంకలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో.. తండ్రీకుమారుడు సజీవ దహనం అయ్యారు. కడప జిల్లా రాజంపేట పట్టణం మంగలమిట్టలోని ఓ ఇంట్లో ఆగస్ట్ 20న జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త గ్యాస్ సిలిండర్ అర్చే సమయంలో గ్యాస్ లీక్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరూ గమనించకపోవడం.. ఘటనకు కారణమైంది. వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఓ వివాహిత మే నెలలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బ్రౌనుపేటలో జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్నో. గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు పోతుండగా.. చాలామంది గాయాలపాలై.. జీవచ్ఛవాల్లా మారుతున్నారు.
చిన్న చిన్న జాగ్రత్తలతో..
గ్యాస్ సిలిండర్ పేలితే ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల కొంతదూరం ప్రభావం చూపిస్తుంది. ప్రమాద తీవ్రత ఆధారంగా.. ఆస్తి, ప్రాణ నష్టానికి అవకాశం ఉంటుంది. వంట చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. పని పూర్తయ్యాక సిలిండర్ నాబ్ ఆఫ్ చేయడం లేదా మర్చిపోవటం వంటి పరిణామాలతోనే.. గ్యాస్ లీకేజ్ అవుతుంటుంది. అందుకే.. సిలిండర్ ఉపయోగించే వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. తరచుగా అయినా.. కనీసం వంటింట్లోకి వెళ్లినప్పుడైనా సరే.. గ్యాస్ లీకేజ్ ను చెక్ చేస్తూ ఉండాలి. వంట అయిన తర్వాత సిలిండర్‌ను ఆఫ్ చేయడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. స్టవ్‌ను ఎప్పుడూ.. సిలిండర్ కంటే ఎత్తులోనే ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్ కింద పెట్టకూడదు. ఒకవేళ గ్యాస్ వాసన వస్తే మాత్రం జాగ్రత్త పడాలి. అప్పుడే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు.
గ్యాస్ లీక్ అవుతోందని మీకు అనుమానం వస్తే..
- గ్యాస్ లీక్ కనిపెట్టేందుకు అగ్గిపుల్ల అట్టించకూడదు
- గ్యాస్ సిలిండర్ స్టవ్‌కు ఉన్న నాబ్స్‌ను ఆఫ్ చేయాలి
- ఎలక్ట్రిక్ స్విచ్‌లను వేయకూడదు
- తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి
- వంట గది పరిసరాల్లో కొవ్వొత్తులు లాంటివి వెలిగించకూడదు
- అనుమానంపై తక్షణమే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కు సమాచారం ఇవ్వాలి
- అవసరమైతే.. ఇండనే, భారత్, హెచ్ పీ గ్యాస్ లీకేజ్ అత్యవసర నంబర్ 1906కు సమాచారం ఇవ్వాలి.. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
సిలిండర్ నుంచి మంటలు వస్తే ఇలా చేయకండి..