ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం.. - క్రైమ్ వార్తలు

ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్​లోని యాప్రల్​లో ఉన్న ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. సదరు ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి మొక్కలు
గంజాయి మొక్కలు

By

Published : Nov 8, 2021, 8:18 PM IST

సికింద్రాబాద్​ యాప్రల్​లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచడం కలకలం రేపింది. గోదావరి గార్డెన్​లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఏడు పెద్ద కుండీల్లో పెంచుతోన్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత కొంత కాలంగా గంజాయి మొక్కలను పెంచుతూ.. స్థానికంగా యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అల్వాల్ డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, సమక్షంలో పంచనామా నిర్వహించారు. మొక్కలను సీజ్ చేసి నిందితులను జవహార్​నగర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details