కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీని తెదేపా నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరాలని నిర్ణయించారు. అమరావతిలో పార్టీ కీలక నేతలతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భేటీలో వంశీ వ్యాఖ్యలు సహా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు నేతలు వెల్లడించారు. ప్రభుత్వ మెడలు వంచైనా ఉచిత ఇసుక కోసం పోరాడాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని అచ్చెన్నాయుడు తెలిపారు.
తెదేపా నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్
గన్నవరం ఎమ్మెల్యే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరాలని తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించారు. అమరావతిలో పార్టీ కీలక నేతలతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
తెదేపా నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్