తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నడిబొడ్డున కోట్లు విలువ చేసే గాంధీ ట్రస్టు భూములు క్రమంగా కనుమరుగవుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. గాంధీజీ ఆశయ సాధన కోసం 1954లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన 9 మంది స్వాతంత్ర్య సమరయోధులు గాంధీ ట్రస్టు స్థాపించారు. సొంత నిధులు, స్థానికుల సహకారంతో ట్రస్టు పేరిట 30.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నంబర్లు 67, 228, 273లో ట్రస్టు భూమి ఉంది. ఈ భూమిని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఇండ్ల స్థలాలుగా మార్చి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో సుమారు 12 ఎకరాల్లో సర్వోదయ ఆశ్రమాన్ని నిర్మించాలని భావించారు.
ఆశ్రమాన్ని నడిపేందుకు అవసరమైన ఆదాయాన్ని క్రమం తప్పకుండా పొందేందుకు ప్రధాన రహదారికి ఆనుకుని దుకాణ సముదాయం నిర్మించాలని ప్రణాళిక రచించారు. గ్రంథాలయం, సామాజిక భవనం, గాంధీ భవనం, ఉచిత వైద్యశాల ఇలా పలు కార్యక్రమాలు చేపట్టాలన్నది స్వతంత్ర సమరయోధుల ప్రధాన లక్ష్యం. 60 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్ల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. 30 ఎకరాల భూమిలో 15000 గజాలు మాత్రమే మిగలగా... ఉన్న 10 వేల గజాల భూమిని అమ్మేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక ట్రస్టుకి మిగిలింది కేవలం 5వేల గజాలే.
60 ఏళ్లలో రూ. 90 లక్షలే..
స్వతంత్ర సమరయోధుల తర్వాత 60 ఏళ్లలో ట్రస్టు కన్వీనర్లు, సభ్యులమంటూ ఎంతోమంది చలామణి అయ్యారు. ఎవరొచ్చినా ఇండ్ల స్థలాల అమ్మకాలపై దృష్టి సారించారే.. తప్ప సర్వోదయ ఆశ్రమ నిర్మాణంవైపు అడుగు ముందుకు వేయలేదు. పైగా 60 ఏళ్లలో ఇండ్ల స్థలాలు అమ్మగా వచ్చిన డబ్బు కేవలం రూ. 90 లక్షలు మాత్రమేనని ట్రస్టు సభ్యులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్రస్టు భూములు ఉన్నది జడ్చర్ల పట్టణం నడిబొడ్డున. పైగా జాతీయ రహదారికి ఆనుకునే. ఆది నుంచి ఆ భూములకు డిమాండ్ ఎక్కువే. ప్రస్తుతం గజానికి 25వేల నుంచి 50వేల వరకు పలుకుతోంది. అలాంటి భూముల్ని అమ్మితే కేవలం 90 లక్షలు మాత్రమే వచ్చాయనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్వార్థ ప్రయోజనాల కోసమే చౌకధరలకు..