భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర - రాజమహేంద్రవరంలో గాంధీజీ సంకల్పయాత్ర
భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభమైంది. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని యాత్ర చేపట్టిన భాజపా నేతలు...నెల్లూరుజిల్లా కావలి, తూ.గో. జిల్లా రాజమహేంద్రవరంలో సంకల్పయాత్ర నిర్వహించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు సంకల్పయాత్ర కొనసాగనుంది.
మహాత్మాగాంధీ150వ జయంతిని పురష్కరించుకుని....భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలుచోట్ల గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభమైంది.ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భాజపా నేతలు సంకల్పయాత్ర చేపట్టారు.దేశంలోని29రాష్ట్రాల్లో సంకల్పయాత్ర చేస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.మహాత్మా గాంధీ ఆశయాలకు సరైన నివాళి అర్పించేలా సంకల్ప యాత్ర కొనసాగనుందని భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.నెల్లూరుజిల్లా కావలి,తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భాజపా నేతలు సంకల్ప యాత్ర చేపట్టారు.