హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పొరుగు సేవల విభాగానికి చెందిన హరిబాబు అనే ఉద్యోగి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఈ చర్యకి పాల్పడినట్లు తెలిపాడు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - గాంధీ ఆస్పత్రి
ఆర్థిక ఇబ్బందులు తాళలేక హరిబాబు అనే ఉద్యోగి.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీతాలు చెల్లించాలని అభ్యర్థించినా యాజమాన్యం పట్టించుకోలేదని హరిబాబు వాపోయాడు. ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
244 మంది రోగులకి సంరక్షకుడిగా హరిబాబును ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగంలో తీసుకుంది. ఎస్ఎస్వీ క్రియేషన్ కాంట్రాక్టర్.. ప్రతి నెలా చాలా ఆలస్యంగా జీతాలు వేస్తున్నట్లు హరిబాబు తెలిపాడు. ఏజిల్ గ్రూప్ సమయానికి జీతాలు వెయ్యడం లేదని ఆరోపించాడు. సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని హరిబాబు వెల్లడించాడు. సమయానికి జీతాలు రాకపోవడంతో.. ఇల్లు గడవక నిప్పంటించుకున్నానని వాపోయాడు. బాధితుడికి ఈ ఘటనలో పది శాతం గాయాలయ్యాయి. గాంధీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:ఇంట్లో భారీ చోరీ.. రూ. 26 లక్షల నగలు మాయం