సీఎం ప్రారంభించిన ప్రదేశంలోనే కోడిపందేలు,జూదం - సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ వార్తలు
ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన ప్రదేశంలోనే జూదం విచ్చలవిడిగా సాగింది. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్...నిన్న సంక్రాంతి పండుగ సంబరాలను ప్రారంభించారు. సీఎం వెళ్లిపోయిన తరువాత అదే ప్రదేశంలో కోడి పందాలు, పేకాట అర్ధరాత్రి వరకూ జోరుగా కొనసాగాయి. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారింది..
gambling is where the CM started sankaranthi celebrations