ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'3 రాజధానులు భారమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడే చెప్పారు' - galla jaydev on three capital

దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఆర్థిక భారమని ప్రస్తుత అధ్యక్షుడు చెప్పారని ఎంపీ గల్లా జయదేవ్​ అన్నారు. మూడు రాజధానులకు మంత్రులు, అధికారులు తిరగటం వ్యయప్రయాసలతో కూడుకుందని చెప్పారు. వాగ్దానాలు విస్మరిస్తే భవిష్యత్తులో ఎక్కడా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రారని హెచ్చరించారు.

galla jaydev on three capital
మూడు రాజధానులపై గల్లా జయదేవ్​

By

Published : Dec 21, 2019, 8:24 PM IST

మూడు రాజధానుల ప్రతిపాదన ఖర్చుతో కూడుకుందని ఎంపీ గల్లా జయదేవ్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయం కోసం రాజధానిని వికేంద్రీకరించే ఆలోచన మంచిది కాదని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రభుత్వ భవనాలు నిర్మించడం కాదన్నారు. మూడు రాజధానులకు మంత్రులు, అధికారులు తిరగటం వ్యయప్రయాసలతో కూడుకుంది అని గల్లా జయదేవ్​ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఆర్థిక భారమని ప్రస్తుత అధ్యక్షుడు చెప్పారని తెలిపారు.పెట్టుబడులు ఆకర్షించేందుకు ఒకే రాజధాని ఉండాలని... అమరావతి తప్పకుండా పెట్టుబడులను ఆకర్షించే నగరంగా ఉంటుందని గల్లా జయదేవ్‌ అన్నారు. వాగ్దానాలు విస్మరిస్తే భవిష్యత్తులో ఎక్కడా భూములు ఇచ్చేందుకు రైతులు రారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details