ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మునుగోడు నుంచి బరిలో గద్దర్.. ఏ పార్టీ నుంచి..! - gaddar contest from munugode

Gaddar in Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్​ విడుదల కాగా.. పార్టీలను అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అనూహ్యంగా తెరపైకి ప్రజాగాయకుడు గద్దర్​ వచ్చారు. ఆయన కేఏ పాల్​ పార్టీ అయిన ప్రజాశాంతి నుంచి బరిలోకి దిగుతున్నారు.

ka paul
gaddar

By

Published : Oct 5, 2022, 5:27 PM IST

Gaddar: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్‌ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల అశీర్వాదం కోసం రేపటి నుంచే ప్రచారం ప్రారంభిస్తానన్నారు.

మునుగోడు నుంచి బరిలో గద్దర్

"భారత రాజ్యాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం నోటు తీసుకోని ఓటు వేయడం నేరం.. అందరికి అదే చెబుతున్నా నోటు తీసుకోకుండా మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఇదే నినాదంతో ఎన్నికల ప్రచారంలోనికి వెళ్తా.. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న మిత్రుడు కేఏ పాల్‌తో కలిసి పని చేయాలనేది నా ఉద్దేశం.. అందుకే నా మద్దతు పాల్​కు ఉంటుంది. రేపటి నుంచే మా ప్రచారం ఉంటుంది."-గద్దర్​, ప్రజాగాయకుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details