అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆఖరు త్రైమాసికానికి గాను... 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు.
ఈ పథకం కింద గతంలోని బకాయిలనూ చెల్లించాలని ప్రభుత్వం ఏపీ క్రీస్టీయన్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీని ఆదేశించింది. మొత్తంగా... 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తానికి బడ్జెట్ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.