ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదు. త్వరలో ఎన్నికలున్న రాష్ట్రాల్లో ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించిన కేంద్రం.. అందులో భాగంగానే ఏపీలోనూ సరకు కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విజయవాడ - ఖరగ్‌పూర్ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామని.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌లో భాగంగా ఖరగ్‌పుర్ - విజయవాడ, తూర్పు - పశ్చిమ కారిడార్ కింద భూసవల్ - ఖరగ్‌పుర్, ధంకుని, ఉత్తర, దక్షిణ కారిడార్‌లో భాగంగా ఈటార్సి నుంచి విజయవాడ వరకు రోడ్డు పనులు చేపట్టనున్నారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు... లక్షా 18 వేల 101 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అందులో లక్షా 8వేల 230 కోట్లు తొలిసారి పెట్టుబడిగా కేటాయించినట్లు వివరించారు.