ఆశావర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదని... వారికి పూర్తిగా రూ.10 వేల వేతనాన్ని చెల్లిస్తామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి పెంచిన వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో పాత బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. వేతనాలు పెంచుతామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారని వివరించారు. దీన్ని ఓర్వలేక కొన్ని శక్తులు తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నాయన్నారు. ఆశావర్కర్లు గమనించాలని కోరారు.
ఆశావర్కర్లకు పూర్తి వేతనం చెల్లిస్తాం: ఆళ్ల నాని - ఆళ్ల నాని
ఆశావర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదని... వారికి పూర్తి వేతనాన్ని చెల్లిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. పాత బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు.
మంత్రి ఆళ్ల నాని