ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్ధరాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం - భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్​లో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రిళ్లు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

అర్ధరాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం

By

Published : Aug 23, 2019, 6:35 AM IST

అర్ధరాత్రి హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. తెలంగాణాలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాంనగర్, హిమాయత్ నగర్, ఎస్​ఆర్​నగర్, మెహదీపట్నం, నాంపల్లి, లక్డీకాపూల్, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్టలోని నిమ్స్ దగ్గర మెట్రో కింద ఉన్న సిమెంట్ ఇటుకలు ఊడిపోయాయి. వర్షానికి నీళ్లు రోడ్డుపైకి రావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజ్​భవన్ రోడ్, లేక్ వ్యూ ప్రాంతంలో రోడ్డుపై నీరు వచ్చి చేరింది. ప్రకృతి నిర్వహణ సిబ్బంది అప్రమత్తమై.. మ్యాన్ హోళ్లు తొలగించి.. నీటిని పంపించారు.

అర్ధరాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details