ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు - revenue conference starts from september 17th

మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తమైంది.

పిల్లి సుభాష్ చంద్రబోస్

By

Published : Sep 13, 2019, 3:33 PM IST

ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు గుర్తించేందుకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో సదస్సులు నిర్వహించనుంది. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం 18 వందల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. డెన్మార్క్ లాంటి దేశాల్లో రీసర్వే విధానాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రం నుంచి అధికారులను పంపించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఆలోచన చేయట్లేదనీ.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details