ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇన్​స్టాలో సైబర్​ నేరగాళ్లతో స్నేహం... రూ. 3 లక్షలకు టోపీ - హైదరాబాద్​లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్​లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకత్వమే పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇన్​స్టాలో స్నేహం పేరుతో ఓ మహిళ నుంచి రూ. 3 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు.

ఇన్​స్టాలో సైబర్​ నేరగాళ్లతో స్నేహం... రూ. 3 లక్షలకు టోపీ
ఇన్​స్టాలో సైబర్​ నేరగాళ్లతో స్నేహం... రూ. 3 లక్షలకు టోపీ

By

Published : Nov 5, 2020, 10:17 AM IST

ఇన్​స్టాలో సైబర్​ నేరగాళ్లతో స్నేహం... రూ. 3 లక్షలకు టోపీ

ఇన్​స్టాగ్రామ్​లో​ స్నేహం పేరిట రూ. 3 లక్షలు సైబర్​ నేరగాళ్లు దండుకున్న ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. సైబర్​ కేటుగాళ్లు ఇన్​స్టాలో ఓ మహిళతో పరిచయం చేసుకున్నారు. స్నేహం పేరుతో డాలర్లు, విలువైన గిఫ్టులు పంపిస్తామని నమ్మబలికారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ నుంచి ఫోన్ చేసి మీకు గిఫ్ట్, కరెన్సీ వచ్చాయని కేటుగాళ్లు తెలిపారు.

వాటిని ఇవ్వాలంటే జీఎస్టీ, కస్టమ్స్, ఐటీ ఇతర ఛార్జీల పేరుతో రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పగా... సదరు మహిళ ఆన్​లైన్ ద్వారా డబ్బును పంపించింది. మోసపోయానని తెలుసుకున్న బాధిత మహిళా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండిఃపోలీస్​ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల

ABOUT THE AUTHOR

...view details