ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉచిత విద్యుత్​కు నగదు బదిలీతో.. ఎవరికీ ఇబ్బంది ఉండదు' - ఏపీలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం వార్తలు

ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండబోదని... ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం పునరుద్ఘాటించారు. ఈ విధానం వల్ల డిస్కమ్‌లు పారదర్శకంగా వ్యవహరించేందుకు వీలవుతుందని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించే ఫీడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కౌలు రైతులకు కూడా ఇబ్బందులు ఉండదన్న హామీని ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.

Ajay Kallam Press Meet
ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం

By

Published : Sep 9, 2020, 10:54 PM IST

సాగుకు నూతన విద్యుత్ విధానంపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని అజేయకల్లం చెప్పారు. డిస్కమ్‌లు పారదర్శకంగా వ్యవహరించేందుకు వీలవుతుందన్న అజేయకల్లం... పగలు 9 గంటల విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇవ్వడానికి వీలవుతుందని వివరించారు. తక్కువ ధరకే విద్యుత్ కూడా కొనుగోలు చేయవచ్చన్న అజేయకల్లం... వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే వినియోగంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

మీటర్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ లోడ్ ఎంత ఉందనేది అర్థమవుతుందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించే ఫీడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే రబీ సీజన్ నాటికి ఫీడర్లు అందుబాటులోకి వస్తాయని... నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఆస్కారం లభిస్తుందని వివరించారు. మీటర్లు బిగించడం వల్ల కంపెనీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని... కౌలు రైతులకు కూడా ఇబ్బందులు ఉండవన్న హామీని ప్రభుత్వం ఇస్తుందని అజేయకల్లం వివరించారు.

ABOUT THE AUTHOR

...view details