ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం.. తుళ్లూరులో ఉద్రిక్తత

మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న హైపవర్‌ కమిటీ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

frantic situation in tulluru
తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు

By

Published : Jan 20, 2020, 10:48 AM IST

Updated : Jan 20, 2020, 11:16 AM IST

మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న హైపవర్‌ కమిటీ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వందల సంఖ్యలో రైతులు, మహిళలు, నిరసనకారులు అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు

వైకాపా పాలనలో తాము రోడ్డు మీదకు వచ్చామని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. 151 సీట్లతో గెలిపిస్తే సీఎం జగన్ తమని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని చేసినా అమరావతిని నిలుపుకుంటామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.

తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు
Last Updated : Jan 20, 2020, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details