రాష్ట్రంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజైన నేడు.. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అన్ని పంచాయతీల వద్ద పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రేపు సాయంత్రం 5 గంటలతో... నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది.
నాలుగో దశ నామినేషన్ల పర్వం - నాలుగో దశ నామినేషన్లు వార్తలు
చెదురు మదురు సంఘటనలు మినహా.. మెుదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగో దశ స్థానిక ఎన్నికలు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆయా జిల్లాలో కొనసాగుతోంది.
నాలుగో దశ నామినేషన్ల పర్వం
మూడో దశ ఎన్నికలకు అభ్యర్థుల నామపత్రాల పరిశీలన పూర్తైంది. ప్రస్తుతం అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మూడో విడత నామపత్రాల ఉపసంహరణ గడువు ముగియనుంది. అనంతరం ఏకగ్రీవాలు సహా పోటీల్లో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈనెల 13న రెండో విడత పోలింగ్ జరగనుండగా... 17న మూడో విడత, 21 న నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ