రాష్ట్రంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎల్లుండి ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడి కానున్నాయి. నాలుగో దశలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరగనుంది. 3,299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. నాలుగో దశలో 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 2,744 పంచాయతీలు, 22,422 వార్డులకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది.
నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం - AP Political news
నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరగనుంది. 3,299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.
నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం