ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rape of 4 year old Girl : చాక్లెట్ ఆశచూపి దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం - 4 yr old girl was raped in rajendra nagar

నాలుగేళ్ల చిన్నారిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చోసుకుంది. పాపకు రక్తస్రావం కావడంతో గుర్తించిన తల్లి.. అసలు విషయం తెలుసుకొని, ​పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rape of 4 year old Girl
Rape of 4 year old Girl

By

Published : Oct 21, 2021, 11:34 AM IST

నిండా నాలుగేళ్లు లేవు.. స్నేహితులతో ఆడుకుందామని బయటకు వెళ్లింది. చాక్లెట్ ఇస్తానని పిలిస్తే.. ఆశతో వెంటవెళ్లింది. గంజాయి కంపు కొడుతుంటే.. ముక్కు మూసుకుంది. తూలుతూ నడుస్తుంటే.. అంకుల్​కి ఏమైందోనని కంగారు పడింది. అంకుల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? చాక్లెట్ ఇవ్వండి అంటే.. అక్కడికి వెళ్లాక ఇస్తానని చెబితే నిజమేనని నమ్మేసింది. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లిన కీచకుడు.. దారుణానికి పాల్పడ్డాడు.

అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మళ్లీ ఏమీ ఎరగనట్టు ఆ పాపను ఆడుకుంటున్న చిన్నారి స్నేహితుల వద్ద వదిలివెళ్లాడు. నొప్పి తట్టుకోలేక ఆ పాప గుక్కపట్టి ఏడుస్తుంటే.. ఏమైందో అర్థంగాక స్నేహితులు బిత్తరపోయారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. ఏమైందోనని వచ్చిచూస్తే.. ఆ చిన్నారికి రక్తస్రావం అవుతోంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బిడ్డపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రహించిన ఆ తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పాపకు రక్తస్రావం కావడం గుర్తించిన తల్లి.. విషయం తెలుసున్న వెంటనే రాజేంద్రనగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాంతు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడికి గంజాయి సేవించే అలవాటుందని స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. గంజాయి మత్తులోనే ఈ అరాచకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

  • ఇదీ చదవండి :MURDER: బంగారం కోసం దారుణం.. ముక్కు, చెవులు కోసేసి వృద్ధురాలి హత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details