ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెంగళూరు 'మత్తు' కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు..! - బెంగళూరు మత్తుమందు కేసు వివరాలు

కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల కేసులో తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మత్తు మందుల కేసులో తెలంగాణకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేల్చారు. వారు డ్రగ్స్‌ పార్టీలకు హాజరైనట్టు గుర్తించారు. త్వరలో నోటీసులిస్తామని కర్ణాటక పోలీసులు పేర్కొన్నారు.

drugs cases
మత్తు మందుల కేసు

By

Published : Apr 5, 2021, 9:13 AM IST

కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు మత్తుమందుల కేసు విచారణ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు శాసనసభ్యులు పలుమార్లు ఆ డ్రగ్స్‌ పార్టీలకు హాజరైనట్లు గుర్తించామని కర్ణాటక రాష్ట్రం గోవిందపుర పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ ఆదివారం తెలిపారు. సరైన సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత విచారణకు హాజరు కావాలంటూ వారికి నోటీసులు పంపిస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు తెలుగుసినీ పరిశ్రమకు చెందినవారు కొందరు ఈ కేసులో ఉన్నా వారి పేర్లన్నీ పోలీసు రికార్డులకే పరిమితమయ్యాయి. దాంతో వారెవన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

పేర్లు బయట పెట్టడంలేదు

బెంగళూరు పోలీసులు కూడా ఆ పేర్లు బయట పెట్టడంలేదు. కానీ ఒక్కసారి నోటీసులు జారీ అయినా, విచారణకు హాజరైనా వారు ఎవరన్నది త్వరలో వెలుగుచూసే అవకాశం ఉంది. ఇప్పటికే రతన్‌రెడ్డి, కలహార్‌రెడ్డి అనే ఇద్దరు హైదరాబాద్‌ పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేసి ఈనెల 5న విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ కేసులో మొదట కన్నడ సినీ నిర్మాత శంకరగౌడను అరెస్టు చేయడంతో హైదరాబాద్‌తో సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. కలహార్‌రెడ్డి హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల పార్టీ ఏర్పాటు చేస్తే, బెంగళూరు నుంచి శంకరగౌడ మత్తు పదార్థాలు సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు.

విదేశీ యువతులపై ఆరా

బెంగళూరు పార్టీలకు ఇరానీ యువతులను రప్పించేవారని పోలీసులు గుర్తించారు. వారు ఎవరనే కోణంతోపాటు హైదరాబాద్‌లో జరిగిన పార్టీలకు కూడా వీరు వెళ్లారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ చూడండి:'మోదీ, షా చెప్పినట్లు చేస్తే సీఎంకు ప్రజా ఆగ్రహం తప్పదు'

ABOUT THE AUTHOR

...view details