అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. విద్యార్థులు ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ ఉపకులపతి ఆదేశాలు ఇచ్చారు. యూనివర్సిటీలో అమరావతికి మద్దతుగా నిరసన తెలపడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిన్న నాగార్జున వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉపకులపతి రాజశేఖర్ చర్యలు తీసుకున్నారు.
అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులు సస్పెన్షన్ - నాగార్జున వర్శిటీ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వార్తలు
అమరావతి కోసం గళం విప్పిన నలుగురు విద్యార్థులను సస్పెన్షన్ చేస్తూ.. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారుల నిర్ణయం తీసుకున్నారు.
four students Suspended by nagarjuna university over amaravthi issue
TAGGED:
అమరావతిలో ఆందోళనల వార్తలు