ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహానాడు: తెలంగాణలో బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చంద్రబాబు - మహనాడులో తెలంగాణ తీర్మనాలు ప్రవేశపెట్టిన అరవింద్ కుమార్ గౌడ్

తెలంగాణలో ఆర్థిక అసమానలతో పాటు రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అరవింద కుమార్ గౌడ ప్రవేశపెట్టిన సంక్షేమానికి కోతలు-మారని బడుగు, బలహీన వర్గాల తలరాతలు అంశంపై తెలంగాణ తీర్మానాన్ని తాజుద్దీన్, అశోక్ లు బలపరిచారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

By

Published : May 27, 2021, 9:44 PM IST

అరవింద్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించటంతో పాటు రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ రెండూ అగ్రస్థానంలో ఉండాలనే తాను నిరంతరం తపిస్తానని వెల్లడించారు. హైదరాబాద్ రాజధానిగా సంపద సృష్టించే ప్రక్రియకు తాను శ్రీకారం చుడితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ అభివృద్ధిని కొనసాగిస్తే... ప్రస్తుతం ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అరవింద కుమార్ గౌడ ప్రవేశపెట్టిన సంక్షేమానికి కోతలు-మారని బడుగు, బలహీన వర్గాల తలరాతలు అంశంపై తెలంగాణ తీర్మానాన్ని తాజుద్దీన్, అశోక్ లు బలపరిచారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి వాటిని తెరాస ప్రభుత్వం విస్మరించిందని నేతలు విమర్శించారు. ఇన్నాళ్లు పార్టీకి ఓ చిన్న మచ్చలా ఉన్న ఓటుకు నోటు వ్యవహారంపై క్లీన్ చిట్ రావటం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:
CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్‌ బోధనపై దృష్టి పెట్టాలి'

ABOUT THE AUTHOR

...view details