కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు వేగంగా డివైడర్ను ఢీకొని హైదరాబాద్ వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఎర్టిగా కారు ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించే మార్గంలో మృతి చెందారు. ఒకరు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల వివరాలు, వారి ప్రాంతాలు
- నారాపోగు గోపయ్య- ఖమ్మం జిల్లా (తెలంగాణ)
- భీం రెడ్డి- మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ)
- మట్టపల్లి భీమ్ రెడ్డి (కర్ణాటక)
- మన్సూర్ - హైదరాబాద్. ఇతను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరికి చెందన వ్యక్తి కాగా.. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.
- విశ్రమ్ కోటేశ్వరరావు