ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : పాముకాటుతో నాలుగు నెలల చిన్నారి మృతి - పాముకాటుతో చిన్నారి మృతి

తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్​లో విషాదం చోటు చేసుకుంది. 4 నెలల చిన్నారిని పాము కాటేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

four-month-old-baby-dies-of-snake-bite-at-narsapur-in-medak
పాముకాటుతో నాలుగు నెలల చిన్నారి మృతి

By

Published : Apr 3, 2021, 3:23 AM IST

తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో పాము కాటుతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. పట్టణానికి చెందిన రాములు, రేణుక దంపతులు కూతురు సావిత్రితో కలిసి ఆరుబయట పడుకున్నారు. ఉదయం చిన్నారి ఏడవడం వల్ల లేచిన తల్లిదండ్రులు.. పామును గుర్తించి చంపారు.

తక్షణమే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పాపను తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పాప చికిత్స పొందుతూ మృతి చెందింది. శవపరీక్ష అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. వారు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండీ... ఏపీలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలున్నాయి: గౌతమ్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details