Karimnagar Car Accident : తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్ వద్ద తెల్లవారుజామున అదుపుతప్పిన వాహనం రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
కేసు నమోదు
కారు బీభత్సంతో ఒకరు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.