ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

IAS Officers Transfer: నలుగురు ఐఏఎస్​ అధికారుల బదిలీ - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

IAS officers transferred: ప్రభుత్వం నలుగురు ఐఏఎస్​ అధికారులను బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పాలనాపరమైన సౌలభ్యం కోసం కొందరు అధికారులను కొత్త జిల్లాలకు నియమించింది.

IAS officers transferred
ఐఏఎస్​ అధికారుల బదిలీ

By

Published : Apr 8, 2022, 9:04 AM IST

IAS officers transferred: తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా అనుపమ అంజలి (ప్రస్తుతం గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌), రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌గా కె.దినేష్‌కుమార్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న టి.నిషాంతిని అక్కడినుంచి బదిలీ చేసి.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లా సచివాలయాల విభాగం జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ను సత్యసాయి జిల్లా జేసీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి: AP Cabinet: కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

ABOUT THE AUTHOR

...view details