ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - రేవల్లి మండలం

ఏమయ్యిందో ఏమో ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నాగపూర్ గ్రామంలో జరిగింది. ఏం జరిగి ఉంటుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

four people suspiciously dead
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

By

Published : Aug 14, 2020, 3:20 PM IST

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. ఆజీరాం బీ(63), ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనుమరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. వంట గదిలో అజీరాం బీ, డైనింగ్‌ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details