ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Foundational Learning మూడోతరగతిలో క్యాలెండర్‌ గుర్తించేవారు 58 శాతం

student learning program : మూడోతరగతి చదివేవారిలో పాఠశాలలకు నడిచి వచ్చేవారు 55శాతం ఉండగా.. సైకిళ్లపై వచ్చేవారు 9శాతం, ప్రజారవాణాలో వచ్చేవారు 8శాతం కాగా.. సొంత వాహనాల్లో వస్తున్నవారు 21శాతం ఉన్నారు. ఇప్పటికీ 50 శాతానికి పైన కాలినడకనే వెళ్తున్నారు. వారిలో 65శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. 40శాతం బడుల్లోనే మెడికల్‌ గది సదుపాయం ఉంది. 51శాతం పాఠశాలల్లోనే దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆంగ్లంలో 72% పదాలు తప్పులు లేకుండా చదువుతున్నారు. తెలుగులో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ వివరాలు కేంద్రం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం-22లోనివి..

Foundational Learning
మూడోతరగతిలో క్యాలెండర్‌ గుర్తించేవారు 58%

By

Published : Sep 8, 2022, 11:43 AM IST

Learning Study Report : రాష్ట్రంలో మూడోతరగతి చదువుతున్న విద్యార్థుల్లో 58% మంది క్యాలెండర్‌లోని నెల, తేదీ, రోజును సరిగా గుర్తించినట్లు కేంద్రం బుధవారం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం-22 (ఫౌండేషనల్‌ లెర్నింగ్‌ స్టడీ) వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తెలుగు, ఆంగ్లం, ఒడియా, కన్నడ, ఉర్దూ భాషలు, గణితం సబ్జెక్టులపై కేంద్ర విద్యాశాఖ ఈ అధ్యయనం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్లభాషలో 155 పాఠశాలల్లో 1,456 మంది, తెలుగుభాషలో 102 బడుల్లో 857 మంది విద్యార్థులకు పలు అంశాలపై పరీక్షలు నిర్వహించింది. క్యాలెండర్‌లోని నెల, తేదీ, రోజును 58% సరిగ్గా చెప్పారు. వేరేవారి సాయంతో 22% మంది చెప్పగా, 6% తప్పులు చెప్పారు, 14% అసలు సమాధానం చెప్పలేకపోయారు. కొలతలు, సమయాలపై ఇచ్చిన కూడికలు, తీసివేతల్లో కొంత వెనుకబడినట్లు ఈ సర్వే తెలిపింది. ఆంగ్ల భాషలో ఇచ్చిన 50 పదాల్లో సగటున 36 (72%) పదాలను తప్పులు లేకుండా చదవగలిగారు. 80%పైగా పదాలను సరిగా చదవగలిగినవారు 63% ఉండగా.. 50-80% చదవగలిగినవారు 17% ఉన్నారు. తెలుగుభాషలో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందువరసలో నిలిచింది. 80-100 తెలుగు అక్షరాలను సక్రమంగా చదివినవారు 74% ఉండగా.. తప్పులు చదివి, వాటిని తామే సరిచేసుకుని 10-49 అక్షరాలు చదివినవారు 8% ఉన్నారు. విద్యార్థులకు 50 పదాలు ఇవ్వగా.. స్పష్టంగా సరాసరిన 34 పదాలను చదవగలిగారు. 80% పదాలను సక్రమంగా చదివినవారు 55% ఉన్నారు. మిగతావారు తడబాటుకు గురవుతూ.. తప్పులను సరిచేసుకుంటూ చదివారు.

50 శాతంపైన బడికి కాలినడకే

మూడోతరగతి చదివేవారిలో పాఠశాలలకు నడిచి వచ్చేవారు 55% ఉండగా.. సైకిళ్లపై వచ్చేవారు 9%. ప్రజారవాణాలో వచ్చేవారు 8% కాగా.. సొంత వాహనాల్లో వస్తున్నవారు 21% ఉన్నారు.

*65% మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే

* 40% బడుల్లోనే మెడికల్‌ గది సదుపాయం ఉంది

* 51% పాఠశాలల్లోనే దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

*ఆంగ్లంలో 72% పదాలు తప్పులు లేకుండా చదువుతున్నారు

*తెలుగులో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందంజ

*కేంద్రం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం-22లో వెల్లడి

ఇవీ చదవండి:


ABOUT THE AUTHOR

...view details