ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గుండెలు ఆగుతున్నా...'అమరావతి' నినాదం ఆగేదిలేదు'

అమరావతి కోసం అన్నదాతలు చేస్తున్న పోరు.... 33 రోజుకి చేరింది. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశం దృష్ట్యా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. మంత్రివర్గ భేటీలో మూడు రాజధానుల ప్రతిపాదనలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తాము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

formers-protests-continue-in-amaravathi
formers-protests-continue-in-amaravathi

By

Published : Jan 19, 2020, 5:10 AM IST


ఉదయం ధర్నాలు, నిరసన దీక్షల హోరు... సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు, ర్యాలీలు.... ఇలా అలుపెరగని పోరాటాన్ని.... అమరావతి అన్నదాతలు 32రోజులుగా కొనసాగిస్తున్నారు. 33వరోజైన ఇవాళ కూడా మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు నిర్వహించనుండగా.... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయిని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు చేయనున్నారు.

33వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
ఒకే నినాదంతో ముందుకుప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల మద్దతుతో పాటు స్వామీజీల యాగాలు, దైవ ప్రార్థనలు, న్యాయపోరాటాలు ఇలా... అమరావతి తరలింపు ఆగేందుకు ఏ చిన్న అవకాశమైనా దొరకకపోదా అనే ఆశతో ప్రతీ పరిణామాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పోరాటంలో పాల్గొంటున్న వారి గుండెలు ఆగుతున్నా.... ఆ బాధను దిగమింగి ఐకమత్యంగా రైతులంతా ఒక్కటే అనే నినాదంతో.... ముందుకు సాగుతున్నారు. ఇంకా ఎన్ని గుండెలు ఆగితే... ప్రభుత్వానికి తమ గోడు తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.కొవ్వొత్తుల ప్రదర్శనలుగత రాత్రి రాజధాని గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. తామంతా రాజధాని రైతుల వెంటే ఉన్నామంటూ సంఘీభావం తెలిపారు. కులమతాలు, చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఒక్కటై ముందుకు సాగుతూ అమరావతే రాజధానిగా కొనసాగాలని నినదిస్తున్నారు.

రేపటి మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ నిర్వహణ దృష్ట్యా పోలీసు ఆంక్షలు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించనున్నారు. ముందస్తు బందోబస్తులో భాగంగా కొంతమందికి నోటీసులు జారీ చేశారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే తమ నిరసనలు కొనసాగించనున్నారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతో పాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.

ఇదీ చదవండి : 20న శాసనసభ ముట్టడి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details