ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పేద వారి కోసం మరో పేదవాడి పొట్టకొడతారా?' - on land acquisition in pittambanda latest

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనే పథకం మంచిదే అయినా అది పలు చోట్ల వివాదాలకు కారణమవుతోంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని బలవంతంగా అధికారులు లాక్కుంటున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదవాడి భూమిని లాక్కుని వేరే వారికి ఇవ్వడమేంటని గుంటూరు జిల్లా పిట్టంబండ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

formers protest for land
'పేద వారికి భూమివ్వటం కోసం మరో పేద వాడి పొట్టకొడతారా?'

By

Published : Feb 24, 2020, 6:03 PM IST

'పేద వారికి భూమివ్వటం కోసం మరో పేద వాడి పొట్టకొడతారా?'

ఉగాదినాటికి నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో పలు చోట్ల చేపడుతున్న స్థలాల సేకరణ వివాదాలకు దారి తీస్తోంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన తంబళ్ల ఏడుకొండలు కుటుంబానికి రెండు ఎకరాల పొలం ఉంది. అందులో ఎకరంన్నరను పేదల ఇంటి స్థలాలకు పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చదును చేస్తున్నారు. ఈ విషయం తెలిసి రైతు, అతని బంధువులు అడ్డుకున్నారు. సుమారు ఏడు తరాల నుంచి ఆ కొద్దిపాటి భూమినే నమ్ముకుని బతుకుతున్నామని..., ఇప్పుడు బలవంతగా స్థలాన్ని తీసుకుంటే తామెలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భూమి మాకొద్దు...

ఒక పేదవాడి పొలం లాక్కుని... తమకు పట్టాలు ఇవ్వటం అన్యాయమని లబ్ధిదారులు అంటున్నారు. పైగా అందులో బాధిత రైతు పూర్వీకుల సమాధులున్నాయి... బోర్లు పడవని చెబుతున్నారు.

ఇవీ చూడండి-'తల్లిని ఎంత ప్రేమిస్తామో ఊరిని అంతే ప్రేమించాలి'

ABOUT THE AUTHOR

...view details