కరోనాను తరిమేద్దాం...అమరావతిని సాధిద్దాం - అమరావతి రైతులు తాజా వార్తలు
అమరావతినే రాజధానిగా సాగించాలనే రైతుల పోరాటం... లాక్ డౌన్ లోనూ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి వెలుగు అంటూ కొవ్వొత్తులు చేతబట్టి నినాదాలు చేశారు.

కొనసాగుతోన్న అమరావతి రైతలు ఆందోళన
కొనసాగుతోన్న అమరావతి రైతలు ఆందోళన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతుల చేస్తున్న ఆందోళన 104 రోజులుగా కొనసాగుతోంది. అమరావతి వెలుగు పేరుతో రైతులు తమ ఇళ్ల వద్దే కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. తుళ్లూరు మండలం మందడం, తుళ్లూరు, అబ్బురాజుపాలె, వెంకటపాలెంలో రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే నిరసనను తెలియజేశారు. మహిళలకు తోడుగా చిన్నారులు ఆందోళనలో పాల్గొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.