ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆధార్ లేకున్నా పెట్టుబడి సాయం' - అన్నదాత సుఖీభవ

పెట్టుబడి సాయంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం లేకున్నా పెట్టుబడి సాయం జమ చేస్తామని తెలిపింది.

రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది

By

Published : Feb 23, 2019, 9:58 PM IST

రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ప‌థ‌కం ప్రారంభం రోజే 41 ల‌క్షల మంది ఖాతాల్లో సొమ్ము జ‌మ చేసింది. ఆధార్‌ అనుసంధానం లేని 3 లక్షల మంది రైతుల ఖాతాలను ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన 11 లక్షల మంది రైతుల ఖాతాల గుర్తింపు కోసం అధికారుల కసరత్తు చేస్తున్నారు.
రైతన్నలూ... ఆందోళన వద్దు
పెట్టుబడి సాయంపై ఏ ఒక్క రైతూ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయమందిస్తామని హామి ఇచ్చింది. పెట్టుబడి సాయానికి ఆధార్‌ లేకపోవడం అడ్డుకాదని... బ్యాంకు ఖాతాకు ఆధార్‌కు అనుసంధానం లేకున్నా పెట్టుబడి సాయం జ‌మ‌ చేస్తామని తెలిపింది. రైతులు ప్రస్తుతం ఉప‌యోగిస్తున్న బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తామని పేర్కొంది.

ఇది కూడా చదవండి.

'మోదీ.. మాయ మాటలొద్దు'

ABOUT THE AUTHOR

...view details