Deve Gowda Support to CM KCR: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సర్వత్రా మద్ధతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ... సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. ఈమేరకు కేసీఆర్కు దేవెగౌడ ఫోన్ చేశారు.
'రావు సాబ్... మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది.' అని సీఎం కేసీఆర్కు దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవెగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు.