మూడు రాజధానుల(three capitals Bill)పై హైకోర్టులో విచారణ పూర్తవుతున్న తరుణంలో.. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుందని గ్రహించే 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నారని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు(Former MP Vadde Shobhanadriswara Rao) ఆరోపించారు. రాజధాని అమరావతిలో ప్రస్తుత పరిస్థితులకు వైకాపా ప్రభుత్వ తీరే కారణమని మండిపడ్డారు.
three capitals Bill: 'మూడు రాజధానుల బిల్లు ఎన్నిసార్లు తెచ్చినా.. ముందుకు వెళ్లలేరు' - Former MP Vadde Shobhanadriswara Rao updates
మూడు రాజధానుల బిల్లు(three capitals Bill)పై విచారణ పూర్తయ్యాక ఎదురు దెబ్బ తగులుతుందని గ్రహించే...బిల్లుల వెనక్కి తీసుకున్నారని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు(Former MP Vadde Shobhanadriswara Rao) అన్నారు. అమరావతిలో ప్రస్తుత పరిస్థితులకు వైకాపా ప్రభుత్వమే కారమణన్నారు. మూడు రాజధానుల బిల్లు ఎన్నిసార్లు తెచ్చినా... న్యాయపరంగా ముందుకు వెళ్లలేరని తేల్చిచెప్పారు
అమరావతి పట్ల మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని... రైతులను పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడటం దుర్మార్గమని ఎంపీ విమర్శించారు. మూడు రాజధానుల బిల్లు ఎన్ని సార్లు తెచ్చిన... న్యాయపరంగా ముందుకు వెళ్లలేరన్నారు.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్‌మెంట్ సంస్థ ఇచ్చిన నివేదికలో విశాఖ కంటే విజయవాడలో నీటి లభ్యత ,కనెక్టివిటీ,తదితర అంశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. చంద్రబాబును మానసికంగా వేధించి... రాజకీయాల నుంచి వైదొలిగేలా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
ఇదీ చదవండి:Farmers Padayatra: పాదయాత్రకు అడుగడుగునా నీరాజనం.. నేడు 24వ రోజు యాత్ర