పోలవరం నిధుల విషయంలో జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు గట్టిగా ప్రశ్నించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంకా 7 వేల 53 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతుంటే.. ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయిందని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన తాను లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం వెంటనే సమాధానం ఇవ్వాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. సీపీఐ రామకృష్ణ పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తే నష్టం ఏంటని నిలదీశారు.
పోలవరం నిధుల కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు?: ఉండవల్లి - former MP Undavalli arunkumar news
పోలవరం విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదని ఆయన ప్రశ్నించారు. సీపీఐ రామకృష్ణ పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తే నష్టం ఏంటని నిలదీశారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్