ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు: సబ్బం హరి

2022లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని మాజీఎంపీ సబ్బం హరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధికారాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు. రాజధానిగా విశాఖ కంటే.. అమరావతే అనుకూలమని అభిప్రాయపడ్డారు. వైకాపాకు ఓట్లేసి వారిలో ఎక్కువ మంది రాజధాని మార్పును తప్పుబడుతున్నారని పేర్కొన్నారు.

సబ్బం హరి
సబ్బం హరి

By

Published : Jul 4, 2020, 4:32 PM IST

2022 సంవత్సరంలో... రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని మాజీఎంపీ సబ్బం హరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని జోస్యం చెప్పారు. రాజధానిని మార్చే సత్తా ఎవ్వరికీ లేదన్నారు. విశాఖ రాజధానిగా అనుకూలం కాదన్న ఆయన.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వానికి ఓట్లు వేసిన 50 శాతం మందిలో దాదాపు 35 శాతం మంది జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని విమర్శించారు. అమరావతిలో పోలీసుల కవాతులు చూస్తుంటే... ఏంటీ పరిస్థితి అనుకున్నానని సబ్బం హరి పేర్కొన్నారు. అమరావతి కోసం విశాఖ నుంచి పాదయాత్రగా రావాలని భావించానని, కానీ లాక్​డౌన్​ వల్ల ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నానని చెప్పారు. అమరావతిపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుందని సబ్బం హరి ఆరోపించారు.

ఇదీ చదవండి :అమరావతిపై మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details