ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: డబ్బున్నోళ్లే టికెట్​ అడగాలి: కొండా సురేఖ - గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​ తాజా వార్తలు

డబ్బున్నవారే టికెట్​ అడగాలని.. తెలంగాణలోని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై హన్మకొండలోని తన నివాసంలో తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ నేతలతో మంతనాలు జరిపారు.

konda surekha
కొండా సురేఖ

By

Published : Apr 16, 2021, 7:19 PM IST

మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ

తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై హన్మకొండలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ నేతలతో మంతనాలు జరిపారు. తెరాస నాయకుల మాయమాటలకు ఎవరూ అమ్ముడుపోవద్దని కొండా సురేఖ సూచించారు.

ఎన్నికల్లో డబ్బే ప్రధానం కాబట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్​గా పోటీ చేయడానికి వచ్చే అభ్యర్థులు ఆర్థికంగా ఉన్నవారై ఉండాలన్నారు. మీరు కొంత డబ్బులు పెడితే మేము కొంత డబ్బులు పెట్టి గెలిపిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని ఎవ్వరూ అమ్ముడుపోవద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details