ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోజే అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరుతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు తాజా వార్తలు

komatireddy rajagopal reddy: కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

komatireddy rajagopal reddy
komatireddy rajagopal reddy

By

Published : Aug 5, 2022, 8:45 PM IST

komatireddy rajagopal reddy: ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరనున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. దిల్లీలో భాజపా నేత వివేక్‌తోపాటు ఆయన.. అమిత్‌ షాను కలిశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చిన రాజీనామాను ఈనెల 8న సభాపతిని కలిసి ఆమోదింపజేసుకుంటానని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరన్న ఆయన.. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను రేవంత్‌రెడ్డి రుజువు చేయలేకపోయారని.. ఇప్పటికైనా రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్‌రెడ్డి కోసం కాదని, తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

ఆరోజే అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరుతున్నా

"భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆత్మగౌరవం ఉన్న వారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరు. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయింది. రాబోయే రోజుల్లో చాలా మంది పార్టీ నుంచి బయటికి వస్తారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్‌రెడ్డి కోసం కాదు. తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు." -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే

అసలేం జరిగిదంటే:కాంగ్రెస్ అధిష్ఠానానికి గురువారం తన రాజీనామా లేఖను పంపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. భవిష్యత్​ కార్యాచరణకు వేగంగా అడుగులు వేస్తున్నారు. రెండేళ్లకు పైగా కాంగ్రెస్​ను వీడే విషయంలో సందిగ్ధంలో ఉన్న ఆయన.. సొంతపార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. భాజపాను పొగడ్తలతో ముంచెత్తుతూ వచ్చారు. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్​ను వీడుతున్నట్లు ప్రకటించిన రాజగోపాల్.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది.

పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్​ నేతల విమర్శలపై ఎదురుదాడికి దిగిన రాజగోపాల్​రెడ్డి.. గురువారం తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు. అదే సమయంలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. ఈ నెల 8న సభాపతి పోచారానికి లేఖను అందజేసే అవకాశముంది. భాజపా జాతీయ నేతలతో సమావేశమై.. పార్టీలో చేరిక తేదీతో పాటు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details