ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - ANdhra pradesh depts

అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను.. సీఎం జగన్‌ మార్చేశారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.

yanamala rama krishnudu
yanamala rama krishnudu

By

Published : Apr 5, 2021, 3:01 PM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్​ చేశారు. అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్​ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. జీతాలు, పింఛన్లు, సంక్షేమం కోసం కూడా అప్పులేనా అని ప్రశ్నించారు.

బకాయిలు చెల్లించక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం వాస్తవం కాదా అని యనమల రామకృష్ణుడు నిలదీశారు. కరోనా సమయంలో వచ్చిన విరాళాలన్నీ ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల్లోనే రూ.73,812 కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకపోయినా.. డబ్బు మాత్రం మాయమవుతోందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details