రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే... భంగపాటు తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో.. ఈ విషయం మరోసారి రుజువైందన్నారు.
కనగరాజ్‌ను ఎస్ఈసీగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ రోజే తాను చెప్పినట్లు సోమిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాజ్యాంగం ప్రకారం ఎన్నికైందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.