DL Ravindrareddy on CM Davos Tour: రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సామాజిక న్యాయం మంత్రుల్లో కాదని.. ప్రజల్లో ఉండాలన్నారు. దావోస్ పర్యటనలో చేసుకున్న మూడు అగ్రిమెంట్లు ఫేక్ అన్నారు. మూడు కంపెనీలతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
'మూడు కంపెనీలతో ఒప్పందం కోసం.. సీఎం దావోస్ వెళ్లాలా?' - Ravindra Reddy has lashed out at CM Jagan
DL Ravindra Reddy on Jagan: రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి ఆరోపించారు. సామాజిక న్యాయం మంత్రుల్లో కాదని, ప్రజల్లో ఉండాలని ఆయన సూచించారు. కేవలం మూడు కంపెనీలతో ఒప్పందం కోసం సీఎం జగన్ దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.
వివేకా హత్య కేసును కోడికత్తి కేసులా రాజకీయ లబ్ధికి వాడుకున్నారని రవీంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా జగన్ గొప్పగా చేసిందేమీ లేదన్నారు. ఆయన పథకాలను నీరుకార్చి జగన్ తన బొమ్మను వేసుకోవడం తప్పితే ఏమీ చేయలేదన్నారు. 108, 104, ఇంటింటింటి బియ్యం పంపిణీ, సంచార పశువైద్య సేవలు సక్రమంగా పని చేయడం లేదన్నారు. నవరత్నాలేమో కానీ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చారని డీఎల్ మండిపడ్డారు.
ఇదీ చదవండి:'మోదీజీ.. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి జైల్లో పెట్టండి'