ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన మూడు రాజధానుల కోసమని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓవైపు రైతులు ఏడాది కాలంగా అమరావతి కోసం ఉద్యమిస్తుంటే ముఖ్యమంత్రి మొండి పట్టుదలతో వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రంలోని భాజపా సర్కారు కూడా రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా తెదేపా వారికి మద్దతు ఇస్తుందని తెలిపారు.
మూడు రాజధానుల కోసమే జగన్ దిల్లీ పర్యటన: పత్తిపాటి - pattipati pullarao comments on cm jagan
ఏడాదిగా రైతులు అమరావతి కోసం ఉద్యమిస్తుంటే సీఎం జగన్ మెుండి పట్టుదలతో వ్యవహరించటం సరికాదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు పార్లమెంటు తెదేపా కన్వీనర్ తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ... అమరావతి ఐకాస రేపు తలపెట్టిన బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎవరూ అవునన్నా, కాదన్నా అమరావతి సృష్టికర్త చంద్రబాబేనని ఆయన కూడా రేపటి కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: