ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి శాపంగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనుబంధం: జవహర్

కేసులకు భయపడి సీఎం జగన్​ రాష్ట్ర రైతు ప్రయోజనాలను కేసీఆర్​, దిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు మేలు చేసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

By

Published : Jul 5, 2021, 8:28 PM IST

Former Minister Jawahar
మాజీమంత్రి జవహర్

"కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ముల అనుబంధం రాష్ట్రానికి శాపంగా మారింది" అని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు.

సాగునీటి సరఫరాలో జాప్యం వల్ల ఇప్పటికే ముమ్మిడివరం మండలంలో పంటవిరామం ప్రకటించారు. సీఎం ఇకనైనా మౌనం వీడకుంటే రాష్ట్రమంతా పంట విరామం ప్రకటించే ప్రమాదం ఉంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు మేలు చేసేలా జగన్ రెడ్డి కేంద్రానికి లేఖలతో సరిపెడుతున్నారు. గత దిల్లీ పర్యటనలో సీఎం జగన్​కు సమయం ఇవ్వటానికి కూడా ఇష్టపడని కేంద్రజలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​కు లేఖ రాశాననటం ప్రజల్ని వంచిచటమే. రబీ సాగుకు రైతులు సన్నద్ధమవుతుంటే ఇంతవరకూ పచ్చిరొట్ట విత్తనాలు అందించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. నీటి సంక్షోభానికి.. విత్తన సంక్షోభం తోడై రాష్ట్రంలో సాగు సంక్షోభం నెలకొంటోంది. వ్యవసాయ మంత్రికి భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై లేదు. - జవహర్, మాజీమంత్రి

ABOUT THE AUTHOR

...view details